చాలా రోజుల తరువాత దర్శకుడు పూరీజగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ రూపంలో ఘనమైన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇన్ని రోజులనుండి లవర్ బాయ్ గా ఉన్నటువంటి రామ్ ని ఒక్కసారిగా మాస్ లుక్ లో చూపించారు దర్శకుడు పూరీ జగన్నాథ్. దానికి తోడు రామ్ తన కొత్త రకమైన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని మరొకసారి విడుదల చేయనున్నారు. కాగా దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. కాగా ఈ విషయాన్నీ ఈ చిత్ర నిర్మాత ఛార్మి తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, ఎన్ని చిత్రాల్లో విడుదల చేయాలనుకుంటున్నారో కూడా వివరించారు. కాగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఈ సినిమాని కొన్ని థియేటర్ లలో ప్రదర్శించనున్నారు.

తెలంగాణలో విడుదల చేసే థియేటర్లు ఇవే…

దిల్‌షుఖ్‌నగర్: వెంకటాద్రి
వరంగల్: లక్ష్మణ్
కరీంనగర్: తిరుమల
ఖమ్మం: ఆదిత్య
ఖాజీపేట: భవానీ


ఏపీలో థియేటర్లు
రాజమహేంద్రవరం: ఊర్వశి
కాకినాడ: దేవీ(స్ర్కీన్ 3)
తిరుపతి: విఖాయత్
గుంటూరు: స్వామి
వైజాగ్: గోకుల్