నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి ‘రామాయణ’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మూడు భాగాలుగా ఉండనుంది. అది కూడా త్రీడీ ఫార్మాట్లో కావడం విశేషం. మొదటి భాగాన్ని 2021 నాటికి ప్రేక్షకులకు అందివ్వాలనుకుంటున్నారు నిర్మాతలు. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల నుండి నటీ నటుల్ని తీసుకుంటున్నారు.

అయితే రాముడి పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ బాగుంటాడని.. తారక్ ఒక్కడే ఆ పాత్రకు న్యాయం చేయగలడని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా ఈ తరంలో హిస్టారికల్ పాత్రలు చేయాలంటే ఒక్క ఎన్టీఆరే గుర్తుకురావడం నిజంగా విశేషమే. ఎలాగూ పౌరాణిక చిత్రాలకు సరిపోగల, అలాంటి సినిమాల్లో నటించాలనే ఆశ ఉన్న హీరోలు తక్కువుగా ఉంటారు కాబట్టి.. టాలీవుడ్ నుండి తారక్ ను తీసుకుంటే బాగానే ఉంటుంది. మరి నిర్మాతల ఆలోచనలు ఎలా ఉన్నాయో.