వైసీపీ నేత..సహ నిర్మాత పీవీపీ పైన దౌర్జన్యం చేసారంటూ ఫిర్యాదు చేసారు. బండ్ల గణేష్‌తో పాటు అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గణేష్‌కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు పీవీపీ ఇంటికి వెళ్లి ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారు. పీవీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తనను కాపాడాలని బండ్ల గణేష ట్విట్టర్ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను అభ్యర్దించారు. పీవీపీ బారి నుండి రక్షించండి అంటూ వేడుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగానే కాకుండా.. సినీ ఇండస్ట్రీలోనూ ఆసక్తి కరంగా మారింది.పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) బండ్ల గణేశ్‌కు 30కోట్లు పెట్టుబడి పెట్టారు. సినిమా విడుదల సమయంలో అసలు మొత్తాన్ని చెల్లించి ఇంకొంత మొత్తానికిగానూ గణేశ్‌ చెక్కులను అందించారు. మిగిలిన డబ్బులు చెల్లించాలంటూ బండ్ల గణేశ్‌ను పీవీపీ కోరారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరో గా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మంచి పాత్ర దక్కించుకుని మళ్ళీ నటుడిగా బిజీ అవ్వాలని చూస్తున్నారు బండ్ల గణేష్‌. ఈ టైమ్‌లో ఆ ఆరోపణలు రావడం అనేది ఆయన కెరీర్ మీద ప్రభావం చూపే అవకాశాలున్నాయి.