మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తమ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్నీ మెగా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. రాంచరణ్ పై తనకున్న ప్రేమను ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా చేసుకుని చెప్తుంది.ఉపాసన ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి నాయకత్వ విభాగంలో మహాత్మా గాంధీ అవార్డు సొంతం చేసుకున్నారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా అవార్డు అందుకున్న విషయాన్ని ఉపాసన తాజాగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.అవార్డు అందుకున్న తన భార్యను చూసి సంతోషంలో తేలిపోయాడు రాంచరణ్. ఒకపక్క తాను నిర్మించిన సైరా సినిమా సూపర్ హిట్ సాధించడం ఇంకొక పక్క తన భార్య అవార్డు గెలుచుకోవడంతో గాల్లోతేలిపోతున్నాడు రాంచరణ్.నవ్కా ఇంకా ఇలాంటి అవార్డులు ఎన్నో గెలుచుకోవాలని సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.