'హలో; సినిమాతో తెలుగు వాళ్ళకి పరిచయం అయిన కళ్యాణి చిత్రలహరిసినిమాతో డీసెంట్ హిట్ కొట్టింది. అయితే ఇప్పుడు హలో సినిమాలో ఈమె చేసిన పాత్ర ఆమె నిజ జీవితంలో కూడా జరగబోతున్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు చిన్నప్పటి ఫ్రెండ్స్. తర్వాత విడిపోయి పెద్దయ్యాక మళ్ళి కలుసుకుంటారు. ఈ కథలో ఉన్నట్టే కాకపోయినా కొంచెం అటూ ఇటూ లో ఆమె కథ కూడా ఇలానే ఉండబోతుంది.కాగా కల్యాణి ఇప్పుడు ప్రేమలో మునిగిపోయిందన్న ప్రచారం హోరెత్తుతోంది  అయితే ఇప్పుడు హలో సినిమాలో ఈమె చేసిన పాత్ర ఆమె నిజ జీవితంలోది. ఈ బ్యూటీ మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కొడుకు ప్రణవ్‌తో ప్రేమలో పడిందట. మోహన్‌లాల్, దర్శకుడు ప్రియదర్శన్‌ కళాశాల రోజుల నుంచి మిత్రులు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఏకంగా 43 చిత్రాలు వచ్చాయి. ఇది ఒక రికార్డు.అంతే కాదు మోహన్‌లాల్, ప్రియదర్శన్‌ కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో మోహన్‌లాల్‌ కొడుకు ప్రణవ్, ప్రియదర్శన్‌ కూతురు కల్యాణిల మధ్య బాల్యం నుంచే స్నేహం కొనసాగుతూ వచ్చింది. అది ఇప్పుడు ప్రేమగా మారిందనే  టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది.  ప్రస్తుతం ప్రణవ్‌, కల్యాణి తమ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రేమ వ్యవహారం గురించిన ప్రశ్నకు నటి కల్యాణి స్పందిస్తూ చాలా తెలివిగా బదులిచ్చింది. ‘నేను ఒకరిని ప్రేమిస్తున్న మాట నిజం. భవిష్యత్‌లో అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఇక తాజాగా శివకార్తికేయన్‌కు జంటగా ‘హీరో’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుంది.