గణేష్ హీరోగా పరిచయం చేస్తూ బీటెల్ లీఫ్ ప్రొడక్క్షన్ మరియు లక్కీ మీడియా సంస్థలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం ఈ రోజు పూజ కార్యక్రమాలతో మొదలయ్యింది. ఈ సినిమాకి 'ప్రేమ ఇష్క్ కాథల్' 'సావిత్రి' లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన పవన్ సాధినేని దర్శకుడు. ఇంకో విశేషమేంటంటే... బ్రోచేవారెవరురా లాంటి హిట్ సినిమా తీసిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి మాటలు రాస్తున్నారు.ఈ సినిమాలో హీరో నలుగురు అమ్మాయిలతో నాలుగు వేర్వేరు కాలాల్లో ప్రేమలో పడతాడు. మొదట టెన్త్ క్లాస్ లో ఒక అమ్మాయితో తర్వాత ఇంటర్ లో మరొక అమ్మాయితో ఆ తర్వాత డిగ్రీలో వేరొక అమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరిగా ఒక వయస్సు వచ్చాక ఇంకొకసారి ప్రేమలో పడతాడని ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుందని ఈ సినిమా యూనిట్ చెప్తుంది. ఈ సినిమా పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దిల్ రాజు తోలి సన్నివేశానికి క్లాప్ కొత్తగా వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం చేశారు