విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోలుగా రూపొందుతున్న మ‌ల్టీస్టార‌ర్ `వెంకీమామ‌`. కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకాల‌పై సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను అక్టోబ‌ర్ 8న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్ ప్రేక్ష‌కుల‌కు విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు.
ఈ కల‌ర్‌ఫుల్ పోస్ట‌ర్ చూస్తే ..ఓ ట్రాక్ట‌ర్‌లో వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, రాశీఖ‌న్నా ఉన్నారు. ప్ర‌స్తుతం సినిమా రామోజీ ఫిలింసిటీలో వేసిన ఓ భారీ సెట్‌లో పాట చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.
త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ)
నిర్మాత‌లు:  సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌
కో ప్రొడ్యూస‌ర్‌:  వివేక్ కూచిబొట్ల‌
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
కెమెరా:  ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి