డైరెక్టర్ సందీప్ వంగా కొత్త సినిమాపై గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.'అర్జున్ రెడ్డి' తో సంచలనం సృష్టించిన సందీప్ వంగా తన రెండవ సినిమాను బాలీవుడ్ లో చేశారు. 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్' ఒరిజినల్ కంటే ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది.షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ 300 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దాంతో ఆ సినిమా నిర్మాతలైన మురద్ కేతాని .. భూషణ్ కుమార్ ఇద్దరూ కూడా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనే మరో సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు.సందీప్ రెడ్డి నిర్మాతలు చేసిన ఈ ప్రకటనతో తెలుగులో స్టార్ హీరోతో ఆయన సినిమా చేయనున్నాడనే ప్రచారానికి తెరపడింది.ఇప్పుడు వారితో సందీప్ మరోసారి కలిసి పనిచేస్తున్నానని ప్రకటించారు. ఈ సినిమా నిర్మాణంలో సందీప్ వంగా హోమ్ బ్యానర్ భద్రకాళి ఫిలిమ్స్ కూడా పాలుపంచుకుంటుంది. ఈ విషయాన్నీ టీ సీరీస్ వారు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా వెల్లడించారు.ఇక ఈ ప్రాజెక్టు గురించి సందీప్ మాట్లాడుతూ "భూషణ్ జీ.. మురాద్ భాయ్ లతో మరో సరి కలిసి పని చేయడం చాలా సంతోషం.  ఈ సినిమా ఒక క్రైమ్ డ్రామా.. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్. దర్శకుడికి అవసరమైన క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చే నిర్మాతలతో పని చేయడం చాలా సంతోషం" అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు ఇతర టెక్నిషియన్ల వివరాలు ఇంకా వెల్లడించలేదు.