బాహుబలి సెన్సేషన్ రాజమౌళి తరువాత దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. సైరా సినిమా వంటి భారీ బడ్జెట్ ప్రాజెక్టును ఆయన నిర్వహించిన విధానంపై సర్వత్రా అద్భుతమైన ప్రశంసలను అందుకుంటోంది. అంతేకాదు సినిమా మంచి టాక్‌ని సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్లు కూడా దండిగానే దండుకుంటుంది. అయితే తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా ప్రభాస్‌తో ఉండబోతుందని, ఆయన కోసం ఒక కథను కూడా రెడీ చేసుకున్నారని, ఆ కథను త్వరలోనే ప్రభాస్‌కి వివరించడానికి రెడీ అయ్యారని తెలుస్తుంది.ఇది కూడా పాన్ ఇండియా చిత్రంగా ఉంటుందట.  తాజాగా చిరంజీవితో ‘సైరా’చిత్రాన్ని తీసి, ప్రశంసలు అందుకున్న సురేందర్ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని నితిన్ తో చేయనున్నట్టుగా ఇటీవల వార్తలొచ్చాయి. అయితే  తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ తో అతని చిత్రం ఉంటుందట.