నటుడు ప్రకాశ్‌ రాజ్‌.22 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన కరుణానిధి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో కంగనా రనౌత్‌ టైటిల్‌రోల్‌ చేస్తున్న చిత్రం ‘తలైవి’.ఈ సినిమాలో కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటించనున్నారట.ఈ నేపథ్యంలోనే ఆయన తమిళ మూవీ 'తలైవి'లో ఒక కీలకమైన పాత్రను చేయనున్నట్టుగా కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు.ఈ సినిమాలో జయలలితగా కంగనా రనౌత్ కనిపించనుంది. జయలలిత బాడీ లాంగ్వేజ్ విభిన్నంగా ఉంటుంది. అందువలన ఆ విషయంపై కంగనా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం . ఇక ఎంజీఆర్ పాత్ర కోసం అరవింద్ స్వామిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కీలకమైన కరుణానిధి పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఇరువర్' (ఇద్దరు) సినిమాలో కరుణానిధి పాత్రలోనే ప్రకాశ్ రాజ్ మెప్పించారు.