కోలీవుడ్ సినీ దర్శకుల సంఘానికి ప్రముఖ సినీ నటుడు సూర్య 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశాడు.దర్శకుల సంఘం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సూర్య ఈ విరాళాన్ని అందించాడు.దర్శకుల సంక్షేమం కోసమే పది లక్షల మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్టు సూర్య తెలిపారు. దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌వీ ఉదయ్ కుమార్‌కు సూర్య ఈ మేరకు రూ.10 లక్షల చెక్‌ను అందించాడు.దర్శకుల సంఘానికి భారీ విరాళం ఇచ్చిన సూర్యకు సంఘం అధ్యక్షుడు ఆర్ కె సెల్వమణి, కోశాధికారి పేరరసు ధన్యవాదాలు తెలిపారు. కోలీవుడ్ నటీనటులు దర్శకుల సంఘానికి అండగా ఉండాలని, భారీగా విరాళాలు ఇవ్వాలని సెల్వమణి కోరారు.