సుప్రీం హీరో సాయి తేజ్ ఇప్పుడు ‘ప్రతిరోజూ పండగే’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.కుటుంబ అనుంధాల నేపథ్యంతో వినోదాత్మకంగా ప్రతిరోజూ పండగే చిత్రాన్ని రూపొందిస్తున్నారు మారుతి. ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. తదుపరి షెడ్యూల్‌ కోసం చిత్ర బృందం అమెరికా వెళ్లనుంది.సత్యరాజ్‌ క్యారెక్టర్‌ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు మారుతి. రావు రమేశ్‌ పాత్ర కూడా సినిమాకి హైలెట్‌గా ఉంటుంది. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మా హీరో సాయి తేజ్‌కి జన్మదిన శుభాకాంక్షలు అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎస్‌.కె.ఎన్, సంగీతం: తమన్,  కెమెరా: జయకుమార్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాబు.