వెంకటేశ్ - నాగచైతన్య కథానాయకులుగా బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ' రూపొందుతోంది. ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడీగా రాశిఖన్నా..వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం పూర్తి వినోదభరితంగా నిర్మితమవుతోంది. మేనమామ – మేనల్లుడు ప్రధాన పాత్రలుగా గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది.ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.అయితే గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం కావడంతో, సంక్రాంతి బరిలో నిలపడమే మంచిదనే ఉద్దేశంతో జనవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.ఇక మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' .. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలు కూడా సంక్రాంతి బరిలోనే నిలవనున్నాయి. ఈ మూడు సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర ఏది విజేతగా నిలుస్తుందో చూడాలి.