విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందించిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయ్ దేవరకొండకి స్టార్ డమ్ తెచ్చిపెట్టేసింది.అంతేకాదు ఈ సినిమాతో విజయ్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కెరీర్‌ను తార స్థాయికి చేర్చిన సినిమా అర్జున్‌ రెడ్డి. అందుకే ఈ సినిమా ఇతర భాషల్లోనూ రీమేక్‌ చేశారు.అదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ టైటిల్ తో సందీప్ రెడ్డి తెరకెక్కించగా, అక్కడ కూడా ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా నిర్మాతలతోనే సందీప్ రెడ్డి వంగా హిందీలో మరో ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు.కోలీవుడ్‌ లోనూ అర్జున్‌ రెడ్డి కథ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.విక్రమ్‌ తనయుడు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న అర్జున్‌ రెడ్డి రీమేక్‌ ఆదిత్య వర్మ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది.ఈ సినిమాను సందీప్‌ రెడ్డి వంగా శిష్యుడు గిరీశయ్య దర్శకత్వం వహించాడు. ఇంతటి సెన్సేషన్‌ సృష్టించిన కథ, కాంబినేషన్‌ కావటంతో ఒరిజినల్ అర్జున్‌ రెడ్డి కాంబినేషన్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ, వరల్డ్ ఫేమస్ లవర్, హీరో, ఫైటర్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సందీప్‌ కూడా రణబీర్‌ కపూర్‌ హీరోగా ఓ డార్క్‌ క్రైమ థ్రిల్లర్‌ను రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితేగాని ఈ కాంబినేషన్‌ సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం లేదు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ  ఈ ప్రాజెక్టు తరువాత తన సినిమా విజయ్ దేవరకొండతోనే వుండనున్నట్టు చెప్పాడు. సందీప్ రెడ్డి వంగా ఈ విషయాన్ని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం  వల్ల  వచ్చే ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్ లో  ఒక సినిమా రూపొందే అవకాశాలు ఉన్నాయి.