కార్తీ హీరోగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘ఖైదీ’ఈ యాక్షన్ థ్రిల్లర్ లో, పారిపోయిన ఖైదీగా కార్తీ కనిపించనున్నాడు.ఆయన ఎందుకు ఖైదీగా మారవలసి వచ్చిందనే అంశం నేపథ్యంలో ఈ సినిమా కథ ఆసక్తికరంగా కొనసాగనుంది.డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు,తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ విడుదల చేస్తున్నారు.ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు చక్కని స్పందన లభించింది. కార్తీ మాట్లాడుతూ పాటలు, రొమాన్స్‌ లేకుండా సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. యాక్షన్‌కు చక్కని భావోద్వేగాలను జోడించి దర్శకుడు తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సి.ఎస్‌., కెమెరా: సత్యన్‌ సూర్యన్‌.