పూరి జగన్నాథ్ సొంత బ్యానర్లో ఆయన తనయుడు ఆకాశ్ హీరోగా 'రొమాంటిక్' చిత్రం రూపొందుతోంది.ఆకాష్ కి జంటగా కేతిక శర్మ నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కొద్దిరోజుల క్రితం విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం రొమాంటిక్ మూవీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తున్నారట. రొమాంటిక్ మూవీలో ఓ పవర్ఫుల్ లేడీ పాత్ర ఉండగా దానికి రమ్యకృష్ణ తీసుకోవడం జరిగిందని తెలుస్తుంది.ఆమె పాత్రను పూరి గొప్పగా డిజైన్ చేశాడని చెప్పుకుంటున్నారు.రమ్యకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన పాత్రల జాబితాలో ఈ పాత్ర కూడా చేరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది.