రచయిత నుంచి దర్శకుడిగా మారిన కొరటాల అనతికాలంలో స్టార్ డైరెక్టర్ హోదా సంపాదించారు. ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. చిరు 152వ చిత్రం సోషియో థీమ్‌తో తెర‌కెక్కనుంద‌ని, ఎండోమెంట్స్ విభాగం మరియు దేవాలయాల నిర్లక్ష్యం సమాజంపై ఎంత చెడు ప్ర‌భావం చూపుతాయో ఈ సినిమా ద్వారా చూపించ‌నున్నార‌ట‌.ఈ సినిమాలో దేవాదాయశాఖలో ఉద్యోగి అయిన కథానాయకుడు, ఆ వ్యవస్థలోని అవినీతిని ఎలా అంతమొందించాడనే నేపథ్యంలో ఈ కథ సాగుతుందని చెబుతున్నారు. నవంబరులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.