సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అనుకోని అతిథి’.ఇన్‌ ట్రూప్‌ ఫిలిమ్స్‌ సమర్పణలో జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ కేరళలో 1970లలో జరిగిన వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ 15న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ చిత్రాన్ని కుటుంబమంతా కలిసి చూడొచ్చు. సాయి పల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్ మరియు అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్‌ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు అని అన్నారు. ఉత్కంఠకు గురి చేసే కథ, కథనాలతో సినిమా రూపొందింది. మలయాళంలోలానే తెలుగులోనూ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అను మోతేదత్‌, స్ర్కీన్‌ప్లే: పి.ఎఫ్‌. మాథ్యూస్‌, నేపథ్య సంగీతం: జిబ్రాన్‌, సంగీతం: పి.ఎస్‌. జయహరి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: దక్షిన్‌ శ్రీన్వాస్, సమర్పణ: శ్రీమతి దీప సురేందర్ రెడ్డి; నిర్మాతలు: అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్; దర్శకత్వం: వివేక్‌.