బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది.పోలీస్ ఆఫీస‌ర్‌గా ఉన్న బాల‌య్య గ్యాంగ్ స్ట‌ర్‌గా ఎలా మారాడ‌నేదే చిత్ర క‌థ అట. ఈ చిత్రానికి ‘క్రాంతి’ ‘జడ్జిమెంట్’ ‘డిపార్ట్‌మెంట్’ అనే ప‌లు టైటిల్స్ ఫిక్స్ చేయ‌నున్నారంటూ ప్రచారం జ‌రిగింది. కాని ఈ చిత్రానికి రూల‌ర్ అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు.అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న జెమినీ టీవీ వారు, తాజాగా ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ టైటిల్ 'రూలర్' అనే సంగతిని చెప్పేశారు.ఈ సినిమాలో బాలయ్య లుక్‌కి సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్లు విడుదలయ్యాయి. కొత్త గెటప్‌లో బాలకృష్ణను చూసి అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆశ్చర్యానికి గురయ్యారు.సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య, రవి కుమార్ కాంబినేషన్లో గత ఏడాది ‘జై సింహ’ అనే డీసెంట్ చిత్రం వచ్చి ఉండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.ఈ మేరకు ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ జెమిని టీవీ ప్రకటించేసింది. ఇందులో సొనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు.