కీర్తి సురేష్ టైటిల్ రోల్‌లో బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వంలో సుధీర్ చంద్ర నిర్మిస్తున్న సినిమా చివరి షెడ్యూల్ నవంబర్ 11 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. నేడు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఆమె లుక్ విడుదల చేసారు చిత్రయూనిట్. ఈ లుక్ అందర్నీ ఆకట్టుకుంటుంది. స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. తనూ వెడ్స్ మనూ ఫేమ్ చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ నిర్మాణంలో సుధీర్ చంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దివాళీకి ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు:
కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు

సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: నగేష్ కుకునూర్
సమర్పణ: దిల్ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
బ్యానర్: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత: సుధీర్ చంద్ర
కో ప్రొడ్యూసర్: శ్రావ్య వర్మ
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్: చిరంతన్ దాస్