తెలుగు హీరో మంచు మనోజ్ కాసేపటి క్రితం తన భార్య ప్రణతి రెడ్డి నుండి విడాకులు తీసుకున్న విషయం వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం "ఒక ఇంపార్టెంట్ మెసేజిని సాయంత్రం ఐదు గంటలకు మీతో షేర్ చేసుకుంటాను" అని వెల్లడించిన మనోజ్ కాసేపటి క్రితం ట్విట్టర్ ద్వారా ఒక పెద్ద మెసేజ్ పోస్ట్ చేశారు.మా వివాహ బంధాన్ని విడాకులతో ముగించాం అని బరువైన హృదయంతో తెలియజేస్తున్నాను. అభిప్రాయబేధాలతో మేమిద్దరం కొన్ని రోజులు బాధపడ్డాం. ఆ తర్వాత బాగా ఆలోచించి విడివిడిగానే మా జీవితాలను కొనసాగించాలని విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాం. విడిపోయినప్పటికీ మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవం, మర్యాదలు ఉన్నాయి. మా నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకొని మా ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటున్నాను. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ సమయంలో నా మనసు మనసులా లేకపోవడంతో నేను ఏ పనీ సరిగ్గా చేయలేకపోయాను.ఇక ముందు బాధనంతటినీ పక్కన పెట్టేసి కెరీర్‌పై దృష్టి పెడతానని తెలిపాడు..తన బాధ అంతటిలో తన కుటుంబం తనకు తోడుగా నిలిచిందని తన పోస్ట్‌లో వివరించాడు.