శంకర్‌ తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి అయిన ”భారతీయుడు” సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ను రెడీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.విశ్వ నటుడు కమల్ హాసన్ మరియు శంకర్ ల కాంబినేషన్ లో 1996లో వచ్చిన ఈ చిత్రం ఒక సెన్సేషన్ అయ్యింది.మళ్ళీ ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ మొదలు పెట్టేసరికి మరిన్ని అంచనాలు పెరిగాయి.అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.వీటిలో ఒకటి 90 ఏళ్ల వృద్దిడి పాత్ర అని సమాచారం. ఐతే ఈ చిత్రం కొరకు ఏకంగా 40కోట్ల బడ్జెట్ తో ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట. భోపాల్ లో జరుగుతున్న ఈ యాక్షన్ సన్నివేశాన్ని పీటర్ హెయిన్స్ పర్యవేక్షణలో హీరో కమల్ పై తెరకెక్కిస్తున్నారని సమాచారం. కాగా ఈ షెడ్యూల్ అనంతరం తైవాన్ మరియు యూరప్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్, రకుల్, సిద్ధార్థ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.