'ఇస్మార్ట్ శంకర్' తో తన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన రామ్, తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. స్రవంతి బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ‘థాడమ్’ అనే తమిళ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా నిర్మితం కానుంది. తమిళంలో మగిల్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ ఏడాది మార్చిలో వచ్చిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది.దాంతో ఆ సినిమాను రామ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. తన కెరియర్లో తొలిసారిగా రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలో నాయికలుగా నివేదా పేతురేజ్ .. మాళవిక శర్మ అలరించనున్నారు.