బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మూడు రోజులుగా ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది.కాలేయ సంబంధిత సమస్యతో సతమతమవుతున్న ఆయన, చికిత్స తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. అయితే వాటిపై ఆసుపత్రి వర్గాల నుండి ఎటువంటి స్పష్టత లేదు. రొటీన్‌ మెడికల్‌ చెకప్‌ కోసమే ఆయన వచ్చారని నానావతీ ఆసుపత్రి వర్గాల నుండి అందుతున్న సమాచారం.ఆసుపత్రిలో ఐసీయూ తరహా సదుపాయాలుండే గదిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.దీంతో ఏ వార్తల్ని నమ్మాలో తెలియక అభిమానులు, సినీ ప్రేక్షకులు కంగారుపడుతూ ఏది ఏమైనా తమ అభిమాన నటుడి ఆరోగ్యం బాగుండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని తెలిపారు.