విలక్షణ సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో క్రిష్ సినిమాలను చేస్తూ వస్తున్నాడు. విభిన్న చిత్రాలను తీస్తూ తనకంటూ ఒక గుర్తింపును దక్కించుకున్న క్రిష్ బాలీవుడ్ లో కూడా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను నిర్మించేందుకు కూడా క్రిష్ ఆసక్తిగా ఉన్నాడు. స్నేహితుడు రాజీవ్ రెడ్డితో కలిసి క్రిష్ 'అంతరిక్షం' సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే.శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో రాచ‌కొండ విద్యాసాగ‌ర్ అనే కొత్త ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ శిరీష్‌తో పాటు గ‌మ్యం, కంచె, గౌతమిపుత్ర శాత‌క‌ర్ణ వంటి సినిమాల‌ను నిర్మించిన ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్స్ రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి `నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా తెర‌కెక్కనుంది. అవ‌స‌రాల శ్రీనివాస్, రుహ‌నీ శ‌ర్మ(చి.ల‌.సౌ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.