అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం "అల‌.. వైకుంఠ‌పుర‌ములో" ఇటీవ‌ల ఈ సినిమాలోని `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌` అనే మెలోడీ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.అసలు విషయం ఏమిటంటే అలవైకుంఠపురంలోని సామజవరగమనా సాంగ్ ఏడు లక్షల లైక్స్ సాధించి తెలుగులోనే ఆ ఘనత సాధించిన సాంగ్ గా నిలిచింది. గత నెల 28న యూట్యూబ్ లో విడుదలైన ఈ సాంగ్ 41మిలియన్ వ్యూస్ ని సాధించడం గమనార్హం.ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి  రచించిన ఈ గీతానికి తమన్ స్వరాలు సమ్మోహన పరుస్తున్నాయి. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ప్రస్తుతం విశేష ఆదరణకు నోచుకుంటోంది. 25లక్షల రూపాయలకు పైగా వెచ్చించి ఈ పాటను ప్రత్యేకమైన సెటప్ లో థమన్, సింగర్ సిద్ శ్రీరామ్ పై రూపొందించారు. వారి ప్రణాళిక ఫలించి ఈ సాంగ్ వలన మూవీ విపరీతమైన ప్రచారం దక్కించుకుంది.బ‌న్నీ, పూజా హెగ్డే, టబు త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణను జ‌రుపుకుంటుంది. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న హ్యాట్రిక్ చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.