కొరటాల శివ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం పనులు వేగంగా సాగుతున్నాయి. కొరటాల శివ ఆఫీస్‌ను సరదాగా సందర్శించారు రామ్‌చరణ్‌. ఆ సందర్భంలో  కొరటాలతో దిగిన ఈ ఫొటోను రామ్‌చరణ్‌ షేర్‌ చేసి, ‘‘శివగారి ఆఫీస్‌లో ఎనర్జీ చాలా నచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోను రామ్‌చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. `అనుకోకుండా కొరటాల శివగారి ఆఫీస్‌కు వెళ్లాను. సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్ నన్నెంతగానో ఆకట్టుకుంది. చిరంజీవి 152వ సినిమాకు శుభాకాంక్షలు` అని చెర్రీ పోస్ట్ చేశాడు.ఇక ఇక్కడి ఫొటో చూస్తే చరణ్‌ అయ్యప్ప దీక్షలో ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. దాదాపు ప్రతి ఏడాదీ చరణ్‌ అయ్యప్ప మాల  వేసుకుంటారు.