వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ హీరోగా వచ్చిన ‘అసురన్’ సినిమా రీమేక్ రైట్స్ కోసం చరణ్ ప్రయత్నం చేస్తోన్నాడట.ధనుష్ కెరీర్ లో రికార్డు స్థాయి గ్రాసర్ గా నిలవడంతో పాటు మరోసారి ఈ చిత్రంతో ధనుష్ విమర్శల ప్రశంసలు దక్కించుకున్నాడు. అసురన్ చిత్రం 100 కోట్లు క్రాస్ చేసి ఇంకా కొనసాగుతూనే ఉంది.పక్కా మాస్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా తన‌కు బాగా సూట్ అవుతుందని చరణ్ భావిస్తున్నారు. పైగా సినిమా కూడా ప్రేక్ష‌కుల నుండే కాకుండా విమ‌ర్శ‌కుల నుండి కూడా ప్ర‌శంస‌లను అందుకుంది.ఇక ఇటీవలే ఈ సినిమా చూసి సూప‌ర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమా చాల బాగుందని ట్వీట్ చేస్తూ అప్రిషియేట్ చేసిన సంగతి తెలిసిందే.అసురన్ చిత్రంలో హీరో పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది.తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి చేస్తే తప్పకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందనే నమ్మకంతో మెగా కాంపౌండ్ రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.మరి నిజంగానే చరణ్ 'అసురన్' రీమేక్పై ఆసక్తి చూపిస్తున్నాడా లేదా అనేది మెగా కాంపౌండ్ నుండి అధికారిక ప్రకటన వస్తే కాని తెలియదు. ప్రస్తుతం చరణ్ 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నాడు.ఇక ‘అసురన్’ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా వి క్రీయేషన్స్ పతాకం ఫై కలైపులి ఎస్ థాను నిర్మించారు.