`జెర్సీ` ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్. ఎంతో నాజూకుగా ఉండే శ్రద్ధ.. అలా ఉందేంటి అనుకుంటున్నారా? అవును.. హీరోయిన్ కాకముందు శ్రద్ధ బొద్దుగానే ఉండేదట. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని పాత ఫోటోను షేర్ చేసిన శ్రద్ధ.. అందంగా కనిపించడం కోసం ఎన్ని కష్టాలు పడిందో వివరించింది.’అది నేను అంతర్జాతీయ విహారయాత్ర చేసిన రోజులు. న్యాయశాఖలో పని చేశాను. ఆ వృత్తిలో ఏడాది గడిచింది. అప్పుడు ఇంతకు ముందెప్పుడూ చేయనంత ఖర్చు చేయడం ప్రారంభించాను. అంటే ఆహారం, దుస్తులు, సినిమాలు చూడడం వంటి అన్ని విషయాలకు ఎడాపెడా ఖర్చు చేసేదాన్ని. చేతినిండా ఆదాయం. సంతోషకరమైన జీవితాన్ని గడిపేశాను.  నెలకొకసారి మాత్రమే శరీరవ్యాయామం చేసేదాన్ని. నచ్చింది తినేసేదాన్ని. దీంతో బరువు పెరిగిపోయాను. నచ్చిన దుస్తులు ధరించేదాన్ని. అంతే కాదు నన్ను నేనెప్పుడూ అందం తక్కువగా భావించేదాన్ని కాదు. అప్పట్లో పలు వ్యక్తిగత సంతోషాలు నాలో ఉండేవి. అయితే నా బద్ధకం కారణంగా అవేవీ అనుభవించలేకపోయాను. అప్పుడు తీసుకున్న ఫొటోను చూసినప్పుడు ఇంత పరువ వయసులోనే అంత బరువు ఉండకూడదన్నది గ్రహించాను.దీంతో అపార్టుమెంట్‌లోనే ఉన్న జిమ్‌కు వెళ్లడం మొదలెట్టాను. మొదట్లో ఐదు నిమిషాలు, ఆ తరువాత 15 నిమిషాలు. ఆపై గ్యాప్‌ లేకుండా 40 నిమిషాలు పరుగులు పెట్టాను. అలా ఐదేళ్లలో 18 కిలోల బరువు తగ్గాను. అందుకు చాలా శ్రమించాను. నిజానికి  నేనంత ఫిట్‌నెస్‌ కాదు. అయినా అంతగా వర్కౌట్లు చేశాను.  క్యాలరీల గురించి,  కసరత్తుల గురించి తెలిసింది. అయితే దురదృష్టవశాత్తు అనారోగ్యానికి గురయ్యాను. దీంతో క్రమబద్ధమైన ఆహారనియమాలకు, వ్యాయామాలకు మధ్య సమతుల్యతను పాటించలేకపోయాను. అయినా  శ్రమించాను. నన్నిలా చేయిండానికి కారణం చాలా సింపుల్‌. నేను ఇంత బరువు తగ్గడానికి.. అంత కష్టపడానికి కారణం ఒక్కటే. నేను చూడ్డానికి అందంగా ఉండాలని అనుకోవడమే. అలా అనుకోవడం వల్లే నేను బరువు తగ్గడంతో పాటు చాలా ఆరోగ్యంగా కూడా ఉండేలా వ్యాయామం చేసేదాన్ని అంటూ తన పోస్ట్ లో ఫాలోవర్స్ కు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు తన సక్సెస్ జర్నీ చెప్పింది.