రాజ్‌త‌రుణ్ కథానాయకుడిగా నూతన దర్శకుడు జి.ఆర్‌.కృష్ణ  తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’.ఈ ప్రేమకథా చిత్రంలో రాజ్ తరుణ్ జోడీగా షాలినీ పాండే నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. రాజ్ తరుణ్ - షాలినీ పాండేపై ఈ పాటను చిత్రీకరించారు. మిక్కీ జె.మేయర్ స్వరపరిచిన ఈ బాణీ చక్కని ఫీల్ ను కలిగిస్తూ సాగుతోంది. ఈ పాటకి తన ఆలాపనతో సమీరా భరద్వాజ్ ప్రాణం పోసింది. 'ఒక నిన్న లోంచి నన్నుకోరి పూసే నేడిలా' అంటూ శ్రీమణి చేసిన పద ప్రయోగాలు బాగున్నాయి. యూత్ కి నచ్చేలా .. వాళ్ల హృదయాలను వెంటనే పట్టేసేలా ఈ పాట వుంది. వచ్చేనెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.