దర్శకుడు  నాగ్ అశ్విన్  నిర్మాతగా ‘జాతిరత్నాలు’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు.  ఈ చిత్రం కామెడీ థ్రిల్లర్ గా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.మహానటి లాంటి బ్లాక్‌ బస్టర్ సినిమా తరువాత స్వప్న సినిమా బ్యానర్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నాగ అశ్విన్‌ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. ఈ సినిమాకు అనుధీప్‌ కేవీ దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదలైంది. 210, 420, 840 నెంబర్లు గల జైలు దుస్తులు ధరించి ఉన్న ప్రియదర్శి, నవీన్, రాహుల్ పోస్టర్ బయటకు వచ్చింది. `ఫన్నీయెస్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్` అని మోషన్ పోస్టర్‌లో పేర్కొన్నారు. విభిన్నమైన బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ అని సమాచారం. ఇప్పటకే ఈ సినిమా షూటింగ్ 80శాతం వరకు పూర్తయినట్టు తెలుస్తోంది.ఆ ముగ్గురి కలయికలో నాగ్ అశ్విన్ చేస్తున్న ప్రయత్నం ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ చిత్రానికి రధన్ సంగీతం.. సిద్ధాన్ మనోహర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా- మురళీశర్మ- వి.కె.నరేశ్- బ్రహ్మాజీ- తనికెళ్ల భరణి- శుభలేఖ సుధాకర్- వెన్నెల కిషోర్ -గిరిబాబు తదితరులు నటిస్తున్నారు.