1965వ సంవత్సరం నుంచి 1975 వరకు  హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్‌ లీడర్‌ ‘జార్జ్‌ రెడ్డి’.‘‘జార్జ్ రెడ్డి’’ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ ‘‘జార్జ్ రెడ్డి’’ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే బిజినెస్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని నవంబర్ 22న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.‘దళం’ మూవీ ఫేం జీవన్‌ రెడ్డి  ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్‌ సినిమా బ్యానర్లతో కలిసి మైక్‌ మూవీస్‌ అధినేత అప్పిరెడ్డి  నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మా సినిమా ట్రైలర్‌తోనే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. జీవన్‌ రెడ్డి ఈ సినిమాను రియలిస్టిక్‌గా తీశాడు.ఎక్కడా రాజీపడకుండా అందరం కష్టపడి ఈ సినిమా తీసాం. బయోపిక్ అయినా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి. అలాంటి కథ ఇది. నవంబర్ 22న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.వ్యాపార పరంగా కూడా మంచి ఆఫర్లు వచ్చాయి. మా చిత్రం థియేట్రికల్‌ రైట్స్‌ను అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ నామా సొంతం చేసుకున్నారు. సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉన్నామని తెలిపారు. ఈ మూవీలో సందీప్ మాధవ్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు.