పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా ఈ ఏడాది జూలై 18వ తేదీన 'ఇస్మార్ట్ శంకర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కేర్ లెస్ ఊరమాస్ తెలంగాణా పోరగాడిగా రామ్ నటన, పూరి టేకింగ్ మాస్ ప్రేక్షకులను కట్టి పడేసింది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం కూడా ఈ మూవీ విజయంలో కీలక పాత్ర పోషించింది.విడుదలైన ప్రతి ప్రాంతంలో ముఖ్యంగా మాస్ ఏరియాల్లో ఈ సినిమా విజయవిహారం చేసింది. ఆ తరువాత విడుదలైన చాలా సినిమాల పోటీని తట్టుకుంటూ నిలబడింది.ఇటు నిధి అగర్వాల్ .. అటు నభా నటేశ్ గ్లామర్ డోస్ పెంచేయడం మాస్ ఆడియన్స్ నుంచి మరిన్ని మార్కులు దక్కడానికి కారణమైంది. వరల్డ్ వైడ్ గా 75కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం  ఈ రోజుతో  100రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఛార్మి, పూరి మరియు మిగతా యూనిట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.