సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రత శిరోద్కర్, వైఎస్ భారతి గారిని ఆమె నివాసంలో కలిశారు.తెనాలి సమీపంలోని మహేష్‌బాబు తండ్రి కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రామంలో అభివృద్ధి పనులకు నమ్రత ప్రభుత్వ సహకారం కోరినట్లు తెలిసింది. ‘గ్రామం ఫౌండేషన్’ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు నమ్రత భారతికి వివరించారు.ఆ గ్రామ అభివృద్ది పనుల గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా మహేష్‌బాబు చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమాలను వైఎస్ భారతి ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది.మా ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని నమ్రత..భారతిని కోరారు. తమ సహకారం తప్పకుండా ఉంటుందని భారతి మాటిచారని సమాచారం.ఇక ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.