దాదాపు దశాబ్దకాలం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఈ లేడీ సూపర్‌స్టార్‌.. మహేష్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి.ఒక‌ప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన విజ‌య‌శాంతి రాజ‌కీయాల్లోకి వెళ్లిన త‌ర్వాత సినిమాల్లో న‌టించ‌లేదు. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రం ద్వారా విజ‌య‌శాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆమె రోల్ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది.అయితే మరో యాంగిల్‌లో తన చూపుతోనే విలన్‌లకు గట్టి వార్నింగ్‌ ఇచ్చినట్లు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మరి ‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి పవర్‌ ఫుల్‌ పాత్ర పోషిస్తుందా లేక క్లాస్‌గా కనిపించనుందా అనేది సినిమా రిలీజ్‌ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. ఇక ప్రస్తుతం విజయశాంతి ఫస్ట్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌గా మారింది. చాలా లాంగ్‌ గ్యాప్‌ తర్వాత తమ అభిమాన నటి ఫస్ట్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ తెగ ఆనందపడుతున్నారు. అంతేకాకుండా లేడీ సూపర్‌స్టార్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.దర్శకుడు అనిల్ రావిపూడి విజయశాంతి కొరకు అద్భుతమైన పాత్రను రూపొందించారనిపిస్తుంది. ఇక మహేష్ హీరోగా, రష్మీక మందాన హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.