లాంగ్‌ గ్యాప్‌ తరువాత మరో ఇంట్రస్టింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ల్యాణ్‌దేవ్. విజేత చిత్రంతో వెండి తెరకు హీరోగా పరిచయమయ్యారు. ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా వచ్చిన ఆ చిత్రం ఆయనకి విజయం చేకూర్చకపోయినా, హీరోగా మంచి మార్కులే పడ్డాయి.అయితే ఆయ‌న రెండో చిత్రం స్టార్ట్ కావ‌డానికి కాస్త స‌మ‌యం ప‌ట్టింది.ఈ చిత్రానికి `సూప‌ర్‌మ‌చ్చి` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. దీపావళి పర్వదినం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్- టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.దర్శకుడు పులి వాసు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రిజ్వాన్ నిర్మిస్తుండగా, యంగ్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్ దేవ్ కి జంటగా రియా చక్రవర్తి నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుందని సమాచారం.