రవితేజ నేడు దీపావళి కానుకగా ఫ్యాన్స్ కి పండుగ గిఫ్ట్ సిద్ధం చేశారు.పండుగను పురస్కరించుకొని రవితేజ తాను చేయనున్న కొత్త సినిమా సంగతులు చెప్పనున్నారు.మధ్యాహ్నం రెండు గంటలకు రవితేజ కొత్త సినిమాకి సంబందించిన దర్శకుడు, నిర్మాత నటీనటులు వంటి విషయాలు వెల్లడించనున్నారు.ఇక రవితేజా ప్రస్తుతం వి ఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా మూవీ చేస్తున్నారు.ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, న‌బా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిస్మ‌స్ కానుక‌గా చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు.ఈ చిత్రానికి  ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీగా రానున్న ఈ మూవీలోని రవి తేజా లుక్ ని కొద్దిరోజుల క్రితం విడుదల చేశారు. 80-90ల కాలం నాటి డాన్ గెటప్ లో ఉన్న రవితేజ అందరిని ఆకర్షించారు.