నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో 'రూలర్' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో 'ధర్మ' పాత్రను బాలయ్య పోషిస్తున్నారు.ఈ సినిమాను సీకే ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు.కాసేపటి క్రిత్రం బాలయ్యకు చెందిన మరో లుక్ ను యూనిట్ విడుదల చేసింది. పోలీస్ యూనిఫాంలో ఉన్న బాలయ్య చేతిలో పెద్ద సుత్తిని పట్టుకుని ఆగ్రహంగా కనపడుతున్నారు.ఈ పోస్టర్ ను చూస్తుంటే… ఓ భారీ యాక్షన్ సన్నివేశానికి సంబంధించినట్టుగా ఉంది.డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌, గడ్డంతో స్లిమ్‌గా కనిపిస్తున్న బాలయ్య లుక్‌ సూపర్బ్ అంటున్నారు ఫ్యాన్స్‌. చాలా కాలంగా ప్రచారంలో ఉన్నట్టుగానే రూలర్‌ అనే టైటిల్‌నే ఫిక్స్‌ చేశారు.ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, భూమిక కీలక పాత్రలను పోషిస్తున్నారు. సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతోంది.