గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్లో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధ‌మ‌వుతుంది.రవితేజ 66వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్‌ మధు నిర్మిస్తున్నారు. గతంలో రవితేజ హీరోగా డాన్‌ శీను, బలుపు లాంటి సూపర్‌ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు గోపిచంద్‌ మలినేని ఈ సినిమాతో రవితేజతో కలిసి హ్యాట్రిక్‌ సక్సెస్‌ అందించేందుకు రెడీ అవుతున్నాడు,దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఈ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసే పనిలో బిజీ గా ఉన్నారని సమాచారం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేవిధంగా ఈ సినిమా ఉండేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నారు. వీరిద్ద‌రి హ్యాట్రిక్ సినిమా కావ‌డంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.ఈ చిత్రంలో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు.సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభోత్సవంకు ముందు ప్రకటించే అవకాశం ఉంది.