శ్రీ హర్ష , ప్రియా , రఘు , కవిత , మణిచందన ప్రధాన పాత్రధారులు గా 'గ్రీన్ క్రాస్'  థియోసైఫికల్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ సమర్పణ లో , షబ్బాబ్ ఫిలిమ్స్ బ్యానర్ పై , బాబు సాహెబ్ నిర్మాత గా , భార్గవ గొట్టుముక్కల దర్శకత్వం లో నిర్మిస్తున్న సందేశాత్మక చిత్రం "వధు కట్నం.. (ఇలా జరగచ్చునేమో )", 'ఉద్యమం ' పాట చిత్రీకరణం మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది . 

చిత్ర దర్శకుడు , చిత్ర కధాంశం గురించి మాట్లాడుతూ , సమాజం లో వివక్ష కు గురి అవుతున్న స్త్రీ ల సమస్యల పై స్పందిస్తూ నిర్మాత అందించిన మూల కధ కి తెర రూపం ఇవ్వడం జరిగిందని , తను సేకరించిన సమాచారం ప్రకారం , కొంత మంది స్కానింగ్ ద్వారా అమ్మాయిలని తెలుసుకుని అబార్షన్స్ చేయించుకుంటూ పోతే , ఇప్పటికే వంద మంది అబ్బాయిలకు వున్న అమ్మాయిల సంఖ్య 90% నుంచి 10% కి పడిపోతే పరిస్థితి ఏంటి , దానికి పరిష్కార మార్గం ఎలా అనే అంశాన్ని చర్చిస్తూ , బాలికలను కాపాడండి (Save the girl) అనే నినాదం తో సమాజానికి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నమే ఈ చిత్ర ప్రధాన కథాంశం అన్నారు . ఈ చిత్రం లోని ఆరు పాటలను సంగీత దర్శకుడు ప్రభు ప్రవీణ్ లంక అద్భుతమైన స్వరాలను అందించారు అని , ప్రస్తుతం ఎడిటింగ్, డబ్బింగ్  దశ లో ఉన్న ఈ చిత్రం తొలి కాపీ త్వరలో సిద్ధం అవుతుంది అని తెలియజేసారు . 

చిత్ర నిర్మాత బాబు సాహెబ్ తనకు దర్శకుడు పై ఉన్న నమ్మకం తో సమాజానికి సందేశాన్ని అందించాలనే సంకల్పం తో , కమర్షియల్ అంశాలని కూడా జోడిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఇది అని , డిసెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు . 

ఈ చిత్రం లో తారాగణం .. శ్రీ హర్ష, ప్రియా, రఘు, కవిత, మణిచందన, చైతన్య, రాకెట్ రాఘవ, రాము (జబర్దస్త్ ), నాగ లక్ష్మి ఇంజి, ఆర్యన్ గౌర, కుషాల్, రేఖ, అనోణ్య, కోటేష్ మానవ, శ్రీనివాసులు, జ్యోతి, సిరి తదితరులు 

సాంకేతిక వర్గం.. 
ఫోటోగ్రఫీ- యస్ .డి .జాన్;
ఎడిటింగ్- సునీల్ మహారణా;
ఆర్ట్- విజయ కృష్ణ;
సంగీతం - ప్రభు ప్రవీణ్ లంక;
పాటలు- శ్రీరామ్ తపస్వి , షేక్  బాబు సాహెబ్ ;
మేకప్ - జె . బాలరాజు;
కాస్ట్యూమ్స్- డి.నాగేశ్వర్ రావు;
కో.డైరెక్టర్స్- శీతరాల రామారావు, గోలి వెంకటేశ్వరులు ;
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- షేక్ హామీత్ బాబు (బబ్లూ);

కథ, నిర్మాత- షేక్ బాబు సాహెబ్ ;
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం- భార్గవ్ గొట్టిముక్కల .