దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమాను విడుదల కానుందని ద‌ర్శ‌క నిర్మాత‌లు పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. డిసెంబ‌ర్ 25న సినిమాను విడుద‌ల చేస్తున్నారు.ఈ సంద‌ర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ –  బ్యాన‌ర్‌లో రాజ్‌తరుణ్ హీరోగా న‌టిస్తోన్న రెండో చిత్ర‌మిది. క్యూట్ ల‌వ్ స్టోరీ. యూత్‌తోపాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమాను డైరెక్ట‌ర్ కృష్ణ తెర‌కెక్కించారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన షాలినీ పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. మరి ఈ సినిమాతోనైనా రాజా తరుణ్ కి షాలినీ పాండేకు మంచి హిట్ వస్తోందేమో చూడాలి.