గీతాంజలి అంటే నాన్న ఎన్ఠీఆర్ కు ఎంతో అభిమానమని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. గీతాంజలి మృతిపట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నటనలో ఆమె ఎప్పుడూ నాన్నని స్ఫూర్తిగా తీసుకునేవారని చెప్పారు.గీతాంజలి మృతి పట్ల బాలకృష్ణ స్పందిస్తూ.ఎప్పుడు క‌లిసినా ఆప్యాయంగా ప‌ల‌క‌రించేవారు. మా కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న వారిలో ఆవిడ ఒక‌రు. నాన్న‌గారంటే ఆవిడకు ఎంతో అభిమానం. నాన్న‌గారు డైరెక్ట్ చేసిన సీతారామ‌క‌ళ్యాణం సినిమాలో సీత పాత్ర‌లో గీతాంజ‌లిగారు న‌టించారు. న‌ట‌న‌లో ఆవిడ నాన్న‌గారిని ఎప్పుడూ ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకునేవారు. తెలుగు సినిమాల్లో న‌టిగా త‌న‌దైన ముద్ర వేశారు. అలాంటి గొప్ప న‌టి మ‌నల్ని విడిచిపెట్టి పోవ‌డం ఎంతో బాధాక‌రం. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి. ఆమె కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను’ అని అన్నారు.ఆమె కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యానివ్వాలని ప్రార్ధిస్తున్నాను’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.