సహజంగా హీరోలు.. నిర్మాతలు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తమ సినిమాలు ప్రదర్శింపబడుతున్న థియేటర్లను సందర్శిస్తూ ఉంటారు.. ప్రేక్షకులతో ముచ్చటిస్తూ ఉంటారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చాడు.‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నిర్మాతగా మారిన అతడు కౌంటర్‌లో కూర్చొని సినిమా టికెట్లు అమ్మాడు.పెళ్లి చూపులు చిత్రంతో విజయ్‌కు సినీ లైఫ్‌ ఇచ్చిన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ను  ‘మీకు మాత్రమే చెప్తా’  సినిమాలో హీరోగా పరిచయం చేశాడు. కామెడీ మూవీ అయిన ఈ చిత్రం శు‍క్రవారం ‍ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా విజయ్‌ ఐమాక్స్‌ థియేటర్‌లోని కౌంటర్‌లో  టికెట్లు అ‍మ్మాడు. అయితే విజయ్‌ టికెట్లు అమ్ముతున‍్నట్లు విషయం తెలుసుకున్న ప్రేక్షకులు థియేటర్‌ దగ్గర గుమ్మిగూడారు. అభిమాన హీరో చేతుల మీదుగా టికెట్లు తీసుకునేందుకు ఎగబడ్డారు. రౌడీ అమ్మిన టికెట్లు సొంతం చేసుకున్న ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. కాసేపు నవ్వుకోడానికైనా ఈ సినిమాను చూడొచ్చు అని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌ను ఇలా భిన్నంగా కూడా చేయవచ్చని విజయ్‌ నిరూపించాడు.