నేచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో షాహిద్‌ నటిస్తున్నాడు.ఇప్పటికే ఆయన క్రికెటర్ పాత్ర కోసం ట్రైనింగ్ కూడా మొదలుపెట్టారు.త్వరలో రెగ్యులర్ షూట్ మొలుకానుంది. ఈలోపు నిర్మాతలు రిలీజ్ డేట్ ప్రకటించేశారు. 2020 ఆగష్టు 28వ తేదీన చిత్రం విడుదలకానుంది.జెర్సీ చిత్రాన్ని హిందీలోను గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించ‌నుండ‌గా, టాలీవుడ్‌ నిర్మాతలైన అల్లు అరవింద్‌, దిల్‌ రాజులు సంయుక్తంగా అమన్‌ గిల్‌తో కలిసి హిందీలో రీమేక్‌ చేయనున్నారు.కాగా ఈ ఎమోషనల్‌ స్పోర్ట్స్ డ్రామా రీమేక్‌తో షాహిద్‌ తొలిసారి తెరపై క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఇందుకోసం క్రికెట్‌ బ్యాట్‌తో గ్రౌండ్‌లోకి దిగిపోయాడు. షాహిద్‌ తాజా లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘ఇక తర్వాత 300 కోట్లకు పరుగులు’ అంటూ ఇప్పటి నుంచే సినిమా కలెక్షన్ల గురించి అంచనాలు పెంచేస్తున్నారు.ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ సాగుతోంది. తాజాగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ ఫోటోని అభిమానులకు షేర్ చేసిన షాహిద్ జెర్సీ ప్రిపరేషన్ బిగిన్స్! అంటూ ఆసక్తికర వ్యాఖ్యను చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో అభిమానుల్లో జోరుగా వైరల్ అవుతోంది.