విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిరవధికంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. మూవీ ప్రారంభంలోనే సినిమా కథేమిటని చెప్పేసిన రాజమౌళి ఆ తరువాత సినిమా గురించి ఎటువంటి విషయాలు బయటపడకుండా జాగ్రత్తలు పడుతున్నాడు. ఎన్టీఆర్ కొమరం భీమ్, చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్న తరుణంలో వీరిద్దరి లుక్స్ బయటకి రాకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారు. కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ ఇంట్రో సీన్ గురించి ఓ ఆసక్తికర వార్త బయటకి వచ్చింది.

హీరోయిజం ని ఒక రేంజ్ లో తెరపై ఆవిష్కరించే రాజమౌళి కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతమైన పోరాట సన్నివేశంతో రూపొందించారట. ఆ ఫైట్ లో ఎన్టీఆర్ యాక్షన్ మూవ్మెంట్స్ కానీ, అలాగే ఆయన డైలాగ్స్ మాడ్యులేషన్ కానీ ప్రేక్షకులకు ఒళ్ళు గగ్గుర్పొడిచేలా ఉంటాయని సమాచారం. ఇక మరో హీరో రామ్ చరణ్ సన్నివేశాలు కూడా అదేస్థాయిలో ఉండేలా జక్కన తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం. చరణ్ కి జంటగా అలియా భట్ నటిస్తుండగా, బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ కీలకపాత్ర చేస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.