ప్రభాస్ తన తరువాత సినిమాని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ తన తదుపరి సినిమా కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌ తో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభాస్ త్వరలోనే కరణ్ జోహార్ ను కలవనున్నాడట. ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా సురేందర్ రెడ్డి ఇప్పటికే ప్రభాస్ కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తోన్నాడట. ఓ స్టైలిష్ ఎంటర్‌టైనర్‌ గా ఈ సినిమా ఉండనుందని.. ముఖ్యంగా ప్రభాస్‌ కు సరిపడే స్టోరీతో ఈ సినిమా రాబోతుందని సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో జాన్(వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్నాడు.

మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివ‌ర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.