సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బావ‌, గుంటూరు పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. `భ‌లే మంచి రోజు`, `శ‌మంత‌క మ‌ణి`, `దేవ‌దాస్` చిత్రాల‌తో ప్రేక్ష‌కుల, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాదు.. క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాల‌ను ద‌క్కించుకున్న యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
రామానాయుడు స్టూడియోలో న‌వంబ‌ర్ 10న గ్రాండ్ లెవ‌ల్లో జ‌ర‌గ‌నున్న ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రవుతున్నారు. త‌న‌దైన స్టైల్లో డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
అశోక్ గ‌ల్లా, న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీరామ్ ఆదిత్య‌.టి
నిర్మాత‌:  ప‌ద్మావ‌తి గ‌ల్లా
బ్యాన‌ర్‌: అమ‌ర్ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  చంద్ర‌శేఖ‌ర్ రావిపాటి
మ్యూజిక్‌:  జిబ్రాన్‌
సినిమాటోగ్ర‌ఫీ:  రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌
ఆర్ట్‌:  రామాంజ‌నేయులు
ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి
డైలాగ్స్‌:  క‌ల్యాణ్ శంక‌ర్‌, ఎ.ఆర్‌.ఠాగూర్‌