విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ`.పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జైలవకుశ సినిమాల దర్శకుడు కే ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశ పనుల్లో ఉంది. కాగా తాజాగా ఈ సినిమా నుండి వెంకీ మామ టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం.రియల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.సినిమా థీమ్ సాంగ్ గా వచ్చిన ఈ సాంగ్ సినిమాలో వెంకటేష్ అండ్ నాగ చైతన్య పాత్రల మధ్య అనుబంధాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసింది. హీరోల పాత్రల పై పూర్తిగా సాగిన ఈ పాటకు తమన్ మంచి ట్యూన్ తో చక్కగా తీర్చిదిద్దారు.‘అమ్మైనా.. నాన్నైనా.. నువ్వెలే వెంకీ మామా’ అంటూ సాగే పాట అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. శ్రీకృష్ణ, మోహన భోగరాజు పాడారు. పల్లెటూరి బ్యాక్‌గ్రౌండ్‌లో చైతు, వెంకీల స్టెప్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.మంచి జోష్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.