సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దర్బార్‌’.నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్‌ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.‘దర్బార్‌’ సినిమా తెలుగు మోషన్‌ పోస్టర్‌ని గురువారం హీరో మహేశ్‌బాబు విడుదల చేశారు. ‘‘రజనీకాంత్‌ సార్‌ నటించిన ‘దర్బార్‌’ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. మీపై ఈ ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. మురుగదాస్‌ సార్, చిత్రబృందానికి నా అభినందనలు’’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు మహేశ్‌బాబు.ఇందులో రజనీకాంత్‌ ఆదిత్య అరుణాచలం అనే పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.కాగా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఇక ర‌జ‌ని పాత్రలో మ‌రో షేడ్‌ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఆ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ. సుభాస్కరన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.2020 సంక్రాంతి కానుకగా ‘దర్బార్‌’ సినిమా విడుదల చేయనున్నారు