మాస్ మహారాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'డిస్కోరాజా'.  ఈ చిత్రంపై రవితేజతో పాటు ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టికున్నారు. ఇప్పటికే విడుదలైన రవితేజ గ్రాఫిక్‌ పోస్టర్‌, బాబీ సింహ లుక్‌, లిరికల్‌ సాంగ్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాని మొదట డిసెంబర్ 20న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే వాయిదా వేయడానికి కారణం ఈ సినిమాకి భారీ విజువల్ గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి ఉండగా అది కాస్తా పెండింగులో ఉందట.తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. డిస్కో రాజా జనవరి 24 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుందని వెల్లడించింది. ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ని డిసెంబర్ లో విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.  ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై రామ్ తాళ్లూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.